తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మద్దిశెట్టి సామేలు!
అక్టోబర్ 17 (విజయక్రాంతి): షెడ్యూల్డ్ కులాలు, తెగల అభివృద్ధి జాతీయ మండలి, న్యూఢిల్లీ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మద్దిశెట్టి సామేలు నియమితులయ్యారు. సంస్థ జాతీయ నాయకత్వం ఆమోదంతో జాతీయ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి.సి. బెర్వాల్ నియామక పత్రాన్ని జారీ చేశారు.
సామాజిక సేవా కార్యక్రమాల్లో మద్దిశెట్టి సామేలు అందించిన సేవలు, చేసిన ప్రత్యేక కృషిని పరిగణనలోకి తీసుకొని ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాలను విస్తరించడంతో పాటు, సామాజిక అభివృద్ధికి కృషి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తారని సంస్థ నాయకత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.