‘కిమ్స్’లోఅరుదైన అయోర్టా శస్త్రచికిత్స

29-09-2026 | 05:05am

గుండెను 30 నిమిషాల పాటు ఆపి చికిత్స

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): కిమ్స్ హాస్పిటల్స్(KIMS Hospitals) కొండాపూర్‌లో 64 ఏళ్ల మహిళకు ప్రమాదకరమైన అక్యూ ట్ అయోర్టా డిసెక్షన్‌కు(Acute Aortic Dissection) 10 గంటల పాటు అరుదైన శస్త్రచికిత్స(Surgery) నిర్వహించారు. కీలక దశలో గుండెను 30 నిమిషాల పాటు ఆపి, శరీర ఉష్ణోగ్రతను 18 డిగ్రీల సెల్సియస్కు త గ్గించి అయోర్టా ఆర్చ్‌ను పునర్నిర్మించారు. చీఫ్ కార్డియోథొరాసిక్ సర్జన్, మినిమల్లీ ఇ న్వేసివ్, రోబోటిక్ సర్జన్ డాక్టర్ నిసర్గ నేతృత్వంలో చికిత్స జరిగింది. చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవి కుమార్ అలూరి, సీనియర్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సమీర్ చౌహాన్, కార్డి యాక్ సర్జన్ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. శస్త్రచికిత్స అనంతరం కొన్ని గంటల్లోనే వెంటిలే టర్ నుంచి తొలగించగా, మరుసటి రోజే మహిళ స్పష్టంగా మాట్లాడారు.

మరిన్ని వార్తలు