ఐటీ నిపుణులతో నిర్మలమ్మ చర్చలు

19-11-2026 | 01:52pm

బడ్జెట్ 2027-28పై నిర్మలా సీతారామన్ కీలక భేటీ.. ఐటీ రంగానికి ఏం ఇవ్వబోతున్నారు?

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2027-28(Union Budget 2027-28) రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఆరోసారి Pre-Budget Consultation సమావేశానికి అధ్యక్షత వహించారు. న్యూఢిల్లీలో జరిగిన ఈ భేటీలో Information Technology (IT) రంగానికి చెందిన నిపుణులు, వివిధ Stakeholders పాల్గొన్నారు. రాబోయే బడ్జెట్‌లో టెక్నాలజీ రంగానికి సంబంధించిన ప్రాధాన్యతలు, అభివృద్ధి అవకాశాలు, పరిశ్రమల అవసరాలపై చర్చించారు.

ఈ సమావేశానికి ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శితో పాటు NITI Aayog CEO, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ Chief Economic Adviser హాజరయ్యారు. ఐటీ రంగంలో పనిచేస్తున్న నిపుణులు, పరిశ్రమ ప్రతినిధుల నుంచి సూచనలు, సలహాలను ఆర్థిక మంత్రి స్వీకరించారు.

2027-28 Union Budgetలో IT Sectorకు ఎలాంటి ప్రోత్సాహకాలు కల్పించాలి? టెక్నాలజీ అభివృద్ధికి పెట్టుబడులు, Innovation, పరిశ్రమల వృద్ధికి ఎలాంటి విధానాలు అవసరం? అనే అంశాలపై ఈ సంప్రదింపులు కీలకంగా మారాయి. వివిధ రంగాల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న కేంద్రం.. వారి అభిప్రాయాలను బడ్జెట్ రూపకల్పనలో పరిగణనలోకి తీసుకోనుంది.

మరిన్ని వార్తలు