గుండె ఆరోగ్యంపై అవగాహన
చార్మినార్ నుంచి కేర్ హాస్పిటల్స్ ప్రోగ్రాం
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ప్రపంచ హృదయ దినోత్సవం(World Heart Day) సందర్భంగా కేర్ హాస్పిటల్స్(CARE Hospitals), నాంపల్లి ఆధ్వర్యం లో చార్మినార్(Charminar) వద్ద అవగాహన నడక నిర్వహించారు. సుమారు 300 మంది స్థానికు లు, విద్యార్థులు, వైద్యులు, ఆసుపత్రి సిబ్బం ది పాల్గొన్నారు. పొగతాగడం, జంక్ ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం, నిద్రలేమి, ఆరోగ్య పరీక్షలను(Health checkups) వాయిదా వేయడం వం టి అలవాట్లను మార్చుకోవాలని వైద్యు లు సూచించారు. కార్యక్రమంలో చార్మినార్ ఎ మ్మెల్యే మీర్ జుల్ఫేకర్ అలీ, కార్పొరేటర్ స య్యద్ సోహైల్ ఖాద్రీ, బాడీబిల్డర్ మీర్ మో తెషం అలీ పాల్గొన్నారు. కేర్ హాస్పిటల్స్ నాంపల్లి హెచ్సీఓఓ డాక్టర్ శశికాంత్, కార్డియాలజిస్ట్ డాక్టర్ అమన్ సల్వాన్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశిష్ మాథుర్ తదితరులు గుండె ఆరోగ్యంపై అవగాహన కల్పించారు.