గ్రామ సమస్యలపై ఐటీడీఏ పీవోకు వినతి
02-11-2026 | 08:11pm
బూర్గంపాడు,(విజయక్రాంతి): ముసలిమడుగు గ్రామపంచాయతీ(Musalimadugu Grama Panchayat) పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ గ్రామ సర్పంచి పూణెం సురేంద్ర ఐటీడీఏ పీవో రాహుల్కు వినతిపత్రం అందజేశారు. సోమవారం భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రామపంచాయతీ పరిధిలోని సమస్యలను పీవో దృష్టికి తీసుకెళ్లారు. గ్రామ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.