పోలీస్ స్టేషన్లలో ఎస్పీ రోహిత్ రాజ్ ఆకస్మిక తనిఖీలు

23-10-2026 | 05:11pm
  1. సిబ్బంది పనితీరుపై ఆరా
  2. కేసుల దర్యాప్తు, పోలీస్ స్టేషన్ నిర్వహణపై సమీక్ష

మణుగూరు, అక్టోబర్ 23 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కరకగూడెం, పినపాక, మణుగూరు పోలీస్ స్టేషన్లను(Manuguru Police Station) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లలో సిబ్బంది పనితీరు, విధుల నిర్వహణ, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుల పరిష్కారంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్న రికార్డులను, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించి, విధుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ తనిఖీలో మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు