పట్టభద్రుల ఓట్ల నమోదుపై అవగాహన
కోదాడ అక్టోబర్ 23(విజయక్రాంతి) : వరంగల్ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల ఓట్ల నమోదు కార్యక్రమంలో(Graduate Voter Registration Program) భాగంగా, కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు, కోదాడ పట్టణ బి.ఆర్.ఎస్. పార్టీ(BRS Party) అధ్యక్షులు షేక్ నయీమ్ ఆధ్వర్యంలో 32వ వార్డులో శుక్రవారం పట్టభద్రుల ఓట్ల నమోదు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. పార్టీ బలపరిచిన అభ్యర్థికి(Candidate) మద్దతు ఇవ్వాలని పట్టభద్రులను కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అభ్యర్థి మాదాల ఉపేందర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంపేట ఉపేందర్, 16వ వార్డు ఇన్చార్జ్ కరీముల్లా, 35వ వార్డు ఇన్చార్జ్ బత్తుల ఉపేందర్, 30వ వార్డు ఇన్చార్జ్ కాసాని మల్లయ్య, చలిగంటి వెంకట్, 26వ వార్డు ఇన్చార్జ్ మజహర్, తాజుద్దీన్, అబ్బు, చీమ శీను, సైదులు తదితరులు పాల్గొన్నారు.