జనగణన ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి

23-10-2026 | 06:06pm

కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, అక్టోబర్ 23 (విజయ క్రాంతి): జిల్లాలో జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను(process of collecting census data) సమగ్రంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించిన జనగణన రెండో దశ శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెండవ దశ జనగణన దేశానికి అత్యంత కీలకమని, భవిష్యత్ ప్రణాళికలు,

అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు సేకరించిన వివరాలు ఉపయోగపడతాయని తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా డిజిటల్ విధానంలో వివరాలు నమోదు చేయనున్నందున సిబ్బంది పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఇంటి వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, జనగణన చట్టం-1948 ప్రకారం సమాచార గోప్యతను కచ్చితంగా పాటించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ సుబ్బరాజు, సీపీఓ కిష్టయ్య, ఆర్డీఓ హరికృష్ణ, మాస్టర్ ట్రైనర్లు, సూపర్‌వైజర్లు, ఎన్యుమరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు