పట్టభద్రులందరూ ఓటు నమోదు చేసుకోవాలి
ములకలపల్లి,అక్టోబర్ 23 (విజయక్రాంతి): అర్హులైన పట్టభద్రులందరూ తమ ఓటు హక్కును(Right to vote) నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని ములకలపల్లి మండల కాంగ్రెస్ బి యల్ ఎ కోఆర్డినేటర్ సురభి రాజేష్(Surabhi Rajesh) పిలుపునిచ్చారు.శుక్రవారం ఆయన స్వయంగా పట్టభద్రుల ఓటు నమోదు(Graduate Voter Registration) చేసుకొని సంబంధించిన వివిధ ధృవ పత్రాలు డిప్యూటీ తహశీల్దార్ భాగ్యలక్ష్మి కి అందచేసారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నాయకత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు(Government Job Appointments), జాబ్ క్యాలెండర్, నైపుణ్యాభివృద్ధి, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి కార్యక్రమాలు యువత భవిష్యత్తుకు ఉపయోగపడేలా రూపొందించబడ్డాయని పేర్కొన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ముఖ్యమని ఆయన అన్నారు.
విద్యావంతులు సమాజాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో(Graduate MLC Election) తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కోరారు.పట్టభద్రుల ఓటు నమోదు ప్రజాస్వామ్యంలో కీలకమైన భాగస్వామ్యమని అర్హత కలిగిన పట్టభద్రులందరూ ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తమ ఓటును నమోదు చేసుకొని,తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పాలకుర్తి సుమిత్, యన్ యస్ యు ఐ మండల అధ్యక్షుడు గుంట్రు సాయి, యువజన కాంగ్రెస్ నాయకులు వెల్కమ్ వెంకటేష్,ముదిగొండ శివ,పొడియం అశోక్ పాల్గొన్నారు.