సైబర్ సెక్యూరిటీలో జాతీయ గుర్తింపు
పోలీస్ వ్యవస్థలో సంస్కరణలు.. సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పోలీస్ శాఖలో పలు మార్పులు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) వెల్లడించారు. హైదరాబాద్లో శుక్రవారం నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల పోలీస్ సమన్వయ కమిటీ(South India Police Coordination Committee) సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రభుత్వం హయాంలో హైడ్రా, ఈగల్, ఈజీ సేఫ్ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా(Drug trafficking), వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా మార్చినట్లు వివరించారు.
సైబర్ నేరాల నియంత్రణ(Control of Cybercrimes), డిజిటల్ భద్రతకు సంబంధించి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సాధించిన గుర్తింపును కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ విభాగానికి కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించినట్లు తెలిపారు. ఈ సమావేశానికి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల డీజీపీలు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య పోలీస్ సమన్వయం, భద్రతా అంశాలపై ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.