సూరారం లో విషాదం

23-10-2026 | 06:15pm

నీళ్ల బకెట్‌లో పడి చిన్నారి మృతి...

కుత్బుల్లాపూర్, అక్టోబర్ 23(విజయక్రాంతి): సూరారం పోలీస్ స్టేషన్(Suraram Police Station) పరిధిలోని విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఏడాదిన్నర వయస్సు గల ఓ చిన్నారి ప్రమాదవశాత్తు నీళ్ల బకెట్ లో పడి మృతి(Death) చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్ రాష్ట్రానికి చెందిన పప్పూ రవిదాస్(45) కూలీ పని చేస్తూ పాండు బస్తీలో నివాసం ఉంటున్నాడు. అతనితో పాటు తన కూతురు రాణీ దేవి కూతురు దివాంశి కుమారి(Divanshi Kumari) నివసిస్తోంది. చిన్నారి తల్లి బీహార్‌లో ఉంటుండగా, పప్పూ రవిదాస్ కుమార్తె చాందిని కుమారి(10) చిన్నారిని ఇంటి వద్ద చూసుకుంటోంది.

ఈ క్రమంలో గురువారం ఉదయం సుమారు 8:00 గంటలకు పప్పూ రవిదాస్ తదితరులు కూలీ పనులకు వెళ్లారు. సాయంత్రం సుమారు 4:30 గంటల సమయంలో చాందిని కుమారి వాష్‌రూమ్‌కు వెళ్లిన సమయంలో, ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి దివాంశి కుమారి ప్రమాదవశాత్తు నీళ్లతో నిండిన బకెట్‌లో పడిపోయింది.

వాష్‌రూమ్ నుంచి బయటకు వచ్చిన చాందిని కుమారి చిన్నారిని గమనించి కేకలు వేయడంతో, స్థానికులు అక్కడికి చేరుకుని చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సురారం పోలీస్ స్టేషన్‌లో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 194 కింద కేసు నమోదు చేసి, మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు