బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన
భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాల్లో(Police Flag Day Celebration) భాగంగా భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో(Bhupalpally District Police Office) శుక్రవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(District SP Sirisetti Sankeerth), కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు(Students') పోలీస్ శాఖ విధులు, ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, సైబర్ నేరాలు(Cybercrimes), ట్రాఫిక్ నిబంధనలు, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. అలాగే బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ(Child Labor System), బాలల అక్రమ రవాణా నిర్మూలన, మహిళలు, బాలికల భద్రతపై డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ తిరుపతి శాస్త్రాల అవగాహన కల్పించారు. 1098, 181 సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ
కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఎస్పీ సంపత్ రావు, సీఐ శ్రీనివాస్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.