ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ

23-10-2026 | 05:58pm

తాడ్వాయి,అక్టోబర్,23( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం(Tadvai Mandal) నందివాడ పల్లె గడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పిరుమాయకుంట తండాలో(Pirumayakunta Tanda) శుక్రవారం ఇందిరమ్మ ఇంటి(Indiramma House) నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. తండాకు చెందిన మెగావత్ జాగూర్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది.ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇంటిని నిర్మించి అండగా నిలుస్తుందని తెలిపారు.

తండావాసులు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జాదవ్ రేణుక గణపతి,పార్టీ అధ్యక్షులు బానోతు శ్రీను, నాయకులు పండరి, నందివాడ సర్పంచ్ పోచయ్య, గ్రామ అధ్యక్షులు కానగళ్ల బాల సాయిలు, కార్యదర్శి రవికాంత్,నాయకులు బాబు సింగ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు