వీవో భవనానికి భూమిపూజ
27-11-2026 | 08:35pm
బేల నవంబర్ 27(విజయక్రాంతి): మండలం లోని శంషాబాద్ గ్రామంలో(Shamshabad Village) న్యూ (మొహబ్బత్పూర్)లో వీవో భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసింది. శుక్రవారం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో సర్పంచ్ విపీన్ ఖోడే ఉప సర్పంచ్ దివాకర్,యువజన కాంగ్రెస్ ఆదిలాబాద్ అసెంబ్లీ(Congress Adilabad Assembly) ఉపాధ్యక్షుడు సామ రూపేష్ రెడ్డి,తో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి(Development of Rural Women's Groups) ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని రూపేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.