ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమం తీవ్రం చేస్తాం

02-11-2026 | 08:20pm

బోథ్. నవంబర్ 2 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూల్ లలో(State Government Model School) పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తుందని ప్రభుత్వ వైఖరి మారకపోతే రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతను చేస్తామని మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్న భోజనం సమయంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు సందుత్వార్ ప్రవీణ్ కుమార్ జి రాజశేఖర్ లు.

మాట్లాడుతూ మొదట నాలుగు ఐదు ఆరు తేదీలలో జిల్లా విద్యాశాఖ అధికారి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు అనంతరం  ఈనెల 10 11 12 తేదీలు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తామన్నారు. ఈనెల 17న రాష్ట్రస్థాయిలో ధర్నా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగానే సోమవారం రోజున స్థానిక ఎంపీడీవో ఎమ్మార్వోలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో ప్రిన్సిపాల్డాక్టర్ ఎస్ అనురాధ తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు