ఉపాధి హామీ సీనియర్ మెట్లకు శిక్షణ

06-11-2026 | 07:23pm

బోథ్. నవంబర్ 6 (విజయక్రాంతి): సోనాల మండలంలోని(Sonala mandalam) రైతు వేదికను శుక్రవారం ఉపాధి హామీ కార్యక్రమంలో(Employment Guarantee Programme) పని చేస్తున్న సీనియర్ మెట్లకు గ్రామాల కార్యదర్శిలకు ఉపాధి హామీ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో రత్నాకర్ రావు మాట్లాడుతూ సీనియర్ మెట్లు పని ప్రదేశంలో ఉండి పనిచేయకుండా అక్కడ పనులను పర్యవేక్షించాలన్నారు. అంతేగాక పని కొలతలు చూడడంతో పాటు హాజరు వేయాలని సూచించారు. గతంలో సీనియర్ మెట్లు పనిచేసేవారని అయితే ఈసారి మాత్రం పని చేయకుండా పర్యవేక్షించాలన్నారు.

మరిన్ని వార్తలు