రైతు గర్జన సభ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

03-11-2026 | 03:17pm

బేల నవంబర్ 03(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో నిర్వహించిన రైతు గర్జన సభను(Rythu Garjana meeting) విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ బీఆర్ఎస్ పార్టీ నాయకుల తరఫున మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రైతు గర్జన సభకు బేల మండలంతో పాటు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి సభను విజయవంతం చేయడం సంతోషకరమన్నారు. సభకు తరలివచ్చిన రైతులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు చూపిన ఆదరణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం పార్టీ పట్ల వారికున్న అభిమానానికి నిదర్శనమన్నారు. సభ విజయవంతానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో నాయకులు సతీశ్ పవార్, దేవన్న, మస్క్ తేజిరావు, కోడే విపిన్, తన్వీర్ ఖాన్, విశాల్ గోడే తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు