పెండింగ్ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి

03-11-2026 | 04:55pm

సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్

ఖమ్మం, నవంబర్ 3 (విజయక్రాంతి): ఖమ్మం సుడా కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం మరియు సుడా ఇంజనీరింగ్ అధికారులతో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్(Suda Chairman Puvvala Durga Prasad) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరంలోని వివిధ డివిజన్లలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల పురోగతిని డివిజన్ల వారీగా సమీక్షించారు. పెండింగ్ పనులను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని, ప్రతి పని నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

అలాగే కాంట్రాక్టర్లు, తమకు కేటాయించిన పనులను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు నిత్యం ఉపయోగపడే అభివృద్ధి పనులకు ప్రాధాన్యతనిస్తూ అధికారులు, కాంట్రాక్టర్లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రతి డివిజన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా సందర్శించి, పనుల పురోగతిని పరిశీలిస్తానని చైర్మన్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, డీఈలు ధరణి, శ్రీనివాస్, మురళి, నరేందర్, ఏఈలు నరేంద్ర, తేజ, యాకూబ్, యాకూబ్ వలి, అకౌంట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు