కరత్వాడ గ్రామ అభివృద్ధి పై సర్వసభ్య సమావేశం తీర్మానాలు
29-10-2026 | 04:06pm
బోథ్. అక్టోబర్ 29 (విజయ క్రాంతి): మండలంలోని కరత్వాడ గ్రామపంచాయతీలో(Karathwada Gram Panchayat) గురువారం గ్రామ అభివృద్ధి పై సర్పంచి విశ్వేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో గ్రామ అభివృద్ధి(Village Development) పై చేపట్టాల్సిన కార్యక్రమాలను పనులను తీర్మానించారు.
త్రాగునీటి సమస్య తోపాటు వేసకాలంలో నీటి ఎద్దడి రాకుండా చేపట్టాల్సిన కార్యక్రమాల పైన గ్రామంలో నీటి సరఫరా, పారిశుధ్యం పనుల నిర్మాణ వీధి దీపాలతో పాటు ఉపాధి హామీ పనుల వేగవంతం పైన సమావేశంలో చర్చించారు. సమావేశంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఉపసర్పంచ్ ధ్యాగల గంగామణి, వార్డు సభ్యులు దేశం భీమ లింగు, వెలమల నారాయణ తదితరులు ఉన్నారు.