క్రైమ్‌పై డీఎస్పీ ఆరా.. అక్రమ రవాణాపై నిఘా!
మఠంపల్లి, అక్టోబర్ 29 (విజయక్రాంతి): మఠంపల్లి మండల పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, హుజూర్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ చరమంద రాజుతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని పలు రికార్డులను (Police Records) పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేసుల సంఖ్య పెరిగిందా, తగ్గిందా అనే అంశాలను పరిశీలించడంతో పాటు, కేసులు పెరిగితే అందుకు గల కారణాలపై ఆరా తీసినట్లు డీఎస్పీ తెలిపారు. మండలంలో గంజాయి, డ్రగ్స్ (Drugs), రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
స్థానిక సిమెంట్ ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కార్మికుల కదలికలపై నిఘా (Surveillance) ఉంచుతున్నట్లు వెల్లడించారు. మహిళలు తమ సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
గృహహింసకు (Domestic Violence) గురవుతున్న మహిళల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, శాంతిభద్రతల పరిరక్షణకు సిబ్బంది సమర్థంగా పనిచేయాలని సూచించారు.
ఈ తనిఖీల్లో ఎస్సై ప్రవీణ్ కుమార్, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.