చిరుతపులి సంచారంపై అవగాహన కల్పించిన అటవీ అధికారులు
నాగిరెడ్డిపేట,అక్టోబర్ 29(విజయ క్రాంతి):మండలంలోని మాల్తుమ్మెద గ్రామస్తులకు చిరుత పులి(Leopard) సంచారంపై గురువారం ఉదయం డిప్యూటీ రేంజ్ అధికారి రాఘవేంద్రరావు(Deputy Range Officer Raghavendra Rao), నాగిరెడ్డిపేట్ ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ వాసుదేవ్ గ్రామస్తులకు అవగాహన కల్పించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...పంట పొలాలకు వెళ్లే రైతులు ఒకరు వెళ్ళకూడదు గుంపులుగా వెళ్లాలని తెలిపారు.
పశువుల కాపర్లు అటవీ ప్రాంతానికి వెళ్లకూడదని వివరించారు.పశువులను ఆరుబయట కట్టి వేయవద్దని పేర్కొన్నారు. చిరుతపులి కనిపించినప్పుడు దాని దగ్గరకు వెళ్లకండి.గుంపులుగా చేరి చూడటానికి ప్రయత్నించకండి.పిల్లలను ఒంటరిగా బయటకు పంపవద్దు.ముఖ్యంగా ఉదయం,సాయంత్రం మరియు రాత్రి వేళల్లో జాగ్రత్తగా ఉండండి.
చిరుతపులిపై రాళ్లు విసరడం,కేకలు వేయడం లేదా దానిని తరమడం చేయవద్దు. పశువులను రాత్రిపూట సురక్షితమైన కొట్టాల్లో ఉంచండి.చిరుతపులి కనిపించిన ప్రదేశం,సమయం మరియు దాని కదలికల వివరాలను వెంటనే నాగారెడ్డిపేట రేంజ్ కార్యాలయానికి లేదా సమీప అటవీశాఖ అధికారులకు తెలియజేయండి.
అటవీ శాఖ మరియు పోలీసు అధికారులు ఇచ్చే సూచనలను తప్పనిసరిగా పాటించండి.చిరుతపులి సంచారం గురించి నిర్ధారణ లేని వార్తలు లేదా వదంతులను ప్రచారం చేయవద్దు.అటవీశాఖకు ప్రజలు సహకరించాలి. ప్రజల ప్రాణాలను, పశువులను మరియు వన్యప్రాణులను రక్షించడం మనందరి బాధ్యత అని అన్నారు.ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుప్పాల సాయిలు,గ్రామస్తులు ఉన్నారు