ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
సుల్తానాబాద్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసిప్రభుత్వ విప్, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(MLA Chintakunta Vijaya Ramana Rao) ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ సూపర్ ఏలినోనో కారణంగా కరువు ఏర్పడనుందని రైతులందరూ వరి పంట కాకుండా ఆరు తడి పంటలు సాగు చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉందని ధాన్యం కొనుగోళ్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచనలు చేశారు.
ధాన్యం సేకరణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డైరెక్టర్లు, సిఈఓ బూరుగు సంతోష్, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దనాయక్ దామోదర్ రావు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, సంఘ సిబ్బంది ,రైతులు తదితరులు పాల్గొన్నారు....