కటారుసుము వేలం.. రూ.లక్ష పలికిన పాట!
29-10-2026 | 05:07pm
టేకులపల్లి, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి గ్రామపంచాయతీలో కొలాగారం, కటారుసుము వేలం పాటను సర్పంచ్ బోడ బాలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ వేలం పాటలో బోడ హిమసాయి రూ.లక్షకు కటారుసుమును దక్కించుకున్నారు. వేలం ద్వారా గ్రామపంచాయతీకి ఆదాయం (Panchayat Revenue) సమకూరింది.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శోభన్, ఉపసర్పంచ్ వసంత, వార్డు సభ్యులు మూడ్ గణేష్ (6వ వార్డు), ధరావత్ కొక్య (8వ వార్డు), జాటోత్ కిరణ్ (4వ వార్డు), బానోత్ రామకృష్ణ (3వ వార్డు), భూక్య ఉష (7వ వార్డు) పాల్గొన్నారు. గ్రామపంచాయతీ ప్రతినిధులతో పాటు స్థానిక వేలంపాటదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.