సోనాల మండల ప్రత్యేక అధికారిగా సిడిపిఓ నియామకం

17-10-2026 | 07:30pm

బోథ్. అక్టోబర్ 17 ( విజయక్రాంతి): సోనాల మండల(Sonala Mandal) ప్రత్యేక అధికారిగా ఐసిడిఎస్ ప్రాజెక్టు(ICDS Project) అధికారి నర్సమ్మ(Narsamma) ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం సోనాల మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టారు. మండల కేంద్రానికి వచ్చిన ప్రత్యేక అధికారిని ఎంపీడీవో రత్నాకర్ రావు(MPDO Ratnakar Rao) తో పాటు వివిధ గ్రామాల కార్యదర్శిలు మండల పరిషత్ సిబ్బంది సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ మండలంలో పలు గ్రామాలలో ఉన్న సమస్యలను కార్యదర్శులు తమ దృష్టి తీసుకురావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మనమందరం కలిసి కృషి చేయాల్సి ఉందన్నారు.

మరిన్ని వార్తలు