ఉట్నూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీ

25-09-2026 | 03:22pm

ఉట్నూర్, సెప్టెంబర్ 25 ( విజయక్రాంతి ):ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని(Government Hospital) ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ (MLA  Vedma Bojju Patel) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి, వైద్య సేవలు, మందుల లభ్యతతో పాటు వైద్యులు, నర్సులు అందుబాటులో ఉంటున్నారా అనే విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఎమ్మెల్యే  స్వయంగా మాట్లాడి, వారికి అందుతున్న వైద్యం, వైద్య సదుపాయాలు, ఎదురవుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆస్పత్రి పరిసరాల్లో పరిశుభ్రత, శానిటైజేషన్ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రోగులకు అత్యవసర సమయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్యులు, నర్సులు 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని ఎమ్మెల్యే గారు వైద్య సిబ్బందికి సూచించారు.

మరిన్ని వార్తలు