ఎస్ ఐ ఆర్ పైన ఎన్నికల సంఘం అభ్యంతరాలను పట్టించుకోకపోవడం ప్రజాస్వామ్యానికి అనర్థం

24-09-2026 | 04:10pm

బోథ్. సెప్టెంబర్ 24 ( విజయక్రాంతి) హోటల్ జాబితా సవరణ ప్రక్రియ(Hotel list modification process) కీలక అంశాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు 10 నెలల కాలంలో 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసిన పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు షేక్ షాకీర్ విమర్శించారు. ఫారం 6 లో మార్పులు హోటల్లో తొలగింపు చేర్పులు డేటా బేస్ నిర్వహణ అంటే అంశాలపై అభ్యంతరాలు నమోదు అయినట్లు పలు పత్రికల్లో వార్తలు ప్రచురించడం జరిగిందన్నారు.

అయినా పెద్ద సంఖ్యలో ఓట్లను తొలగించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లేనన్నారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేసిన పట్టించుకోవడంలేదని విమర్శించారు. ఇందుకు బాధ్యులైన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ కుమార్ ను తొలగించాల్సి ఉందన్నారు. ఈ వేవారంపై ప్రజలకు అనుమానాలు లేకుండా నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు