సీఈసీపై హిమంత సంచలన వ్యాఖ్యలు
24-09-2026 | 04:17pm
గౌహతి: ఎన్నికల సంఘం(Election Commission) నిర్ణయాలు ఏకపక్షంగా ఉండవని అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ(CM Himanta Biswa Sarma) స్పష్టం చేశారు. సీఈసీ ఇతర ఎన్నికల కమిషనర్లను సంప్రదించకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరని ఆయన పేర్కొన్నారు. ఈసీ ఒక సమిష్టి సంస్థగా పనిచేస్తుందని, కీలక నిర్ణయాలు కమిషన్ సభ్యుల మెజారిటీతోనే తీసుకుంటారని హిమంత తెలిపారు. సీఈసీపై వస్తున్న విమర్శలను ఆయన రాజకీయ ప్రచారంగా అభివర్ణించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తెలిసిన వారు ఇలాంటి ఆరోపణలు చేయరని హిమంత బిస్వా శర్మ దుయ్యబట్టారు.