అంకంపాలెం గిరిజన బాలికల జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు జరుగుచున్నవి
దమ్మపేట, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): మండల పరిధిలోని అంకంపాలెం లో గల తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో(Telangana State Tribal Welfare Gurukul Girls Junior College) 2026-2027 విద్యా సంవత్సరానికి గిరిజన ప్రాంత విద్యార్థినులకు ఇంటర్ మొదటి సంవత్సరం (1 ఇయర్) లో ప్రవేశాల నిమిత్తం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ షేక్ బీజాంబి ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హత కలిగిన గిరిజన విద్యార్థినులు సెప్టెంబర్ 24, 2026 నుండి సెప్టెంబర్ 26, 2026 వ తేదీ వరకు నిర్ణీత గడువులోపు కాలేజీ కి వచ్చి దరఖాస్తు చేసుకోవలసినదిగా తెలిపారు. ఖాళీల వివరాలు ఎంపీసీ గ్రూప్ 3, సీఈసీ గ్రూప్ 7, ఎచ్ఈసీ గ్రూప్ 7 సీట్లు అందుబాటులో వున్నాయన్నారు. విద్యార్థినులు అవసరమైన అన్ని ధ్రువపత్రాలతో సకాలంలో కళాశాలలో హాజరు కావలసినదిగా కోరారు. మరిన్ని వివరాలకు కళాశాల ప్రిన్సిపల్ షేక్ భీజాంబీ ను మొబైల్ నంబర్ 9490957285 లో సంప్రదించాలని తెలిపారు.