నో ఎంట్రీ!

24-09-2026 | 07:24am

హైదరాబాద్: గణేశ్ నిమజ్జనం() నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు హైదరాబాద్ పోలీసులు(Hyderabad Police) ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డులో రేపు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్(CP Sajjanar) తెలిపారు. నిమజ్జన ఊరేగింపుల దృష్ట్యా ఈ మార్గాల్లో సాధారణ వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదని సీపీ స్పష్టం చేశారు. ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, అత్యవసర పరిస్థితులు లేకుండా ఆంక్షలు ఉన్న ప్రాంతాల వైపు వెళ్లకుండా సహకరించాలని పోలీసులు సూచించారు. అలాగే రేపు ప్రైవేట్ బస్సులు, ట్రక్కులను నగరంలోకి అనుమతించబోమని పోలీసులు తెలిపారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఆస్పత్రులకు వెళ్లేవారికి ప్రత్యేక ఏర్పాట్లు

అత్యవసర వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అంబులెన్స్‌ల రాకపోకలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు, సొంత వాహనాల్లో ఆస్పత్రులకు వెళ్లే వారికి కూడా అవసరమైన సహాయం అందించనున్నట్లు వెల్లడించారు. హెల్స్ లైన్ నంబర్లు 8712660600, 9010203626. ట్రాఫిక్ ఆంక్షల కారణంగా ఆస్పత్రికి వెళ్తూ ఎవరైనా ఇబ్బందుల్లో చిక్కుకుంటే సంబంధిత హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సహాయం తీసుకోవాలని కోరారు. గణేశ్ నిమజ్జనం సందర్భంగా నగరంలో భారీగా వాహనాలు, భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు పోలీసుల సూచనలు పాటిస్తూ ట్రాఫిక్ నిర్వహణకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.


మరిన్ని వార్తలు