తెలంగాణలో రెడ్ అలర్ట్.. ఐదు జిల్లాలకు హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) హెచ్చరించింది. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్
గురువారం మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాల పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లో సాధారణ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నగరంలో బుధవారం సాయంత్రం నుంచి పలుచోట్ల చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో అత్యధికంగా 14 సెం.మీ వర్షపాతం నమోదైంది. తెలంగాణలో కొమురం భీం జిల్లాలో 10 సెం.మీ, కెరమెరిలో 9 సెం.మీ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 7 సెం.మీ, ఆదిలాబాద్‌లో 7.6 సెం.మీ, ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో 7 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తీరం దాటిన తీవ్ర వాయుగుండం
కళింగపట్నానికి నైరుతి దిశలో ఉన్న తీవ్ర వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మరో 48 గంటల పాటు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉండటంతో పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉం