పెద్దబడి విద్యార్థులకు దుస్తుల పంపిణి

24-09-2026 | 04:34pm
  1. పూర్వ విద్యార్థుల సౌజన్యంతో అందజేత 
  2. దాదాపు 80 వేలతో 190 మందికి దుస్తుల పంపిణి 
  3. హాజరైన మండల విద్యాధికారి రవీందర్ 
  4. గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలకవర్గం

ముస్తాబాద్,సెప్టెంబర్ 24(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలోని(Pothugal village) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School) ఇంచార్జి  ప్రధానోపాధ్యాయులు మామిండ్ల భూపతి  అధ్యక్షతన విద్యార్థులకు దాదాపు 80 వేల రూపాయల విలువ గల 190 దుస్తులను పాఠశాల పూర్వ విద్యార్థుల సౌజన్యంతో గురువారం విద్యార్థులకు గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్,మండల విద్యాధికారి అంబటి రవీందర్ చేతుల మీదుగా ఉప సర్పంచ్ కోల కృష్ణ, వార్డు సభ్యుడు జంగ రాజు,కాంగ్రెస్ జిల్లా నాయకుడు పెద్దిగారి శ్రీనివాస్,యూత్ నాయకుడు వరి వెంకటేష్  కలిసి విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ మన పెద్ద బడిలో విద్యను అభ్యసించి వివిధ హోదాలో స్థిరపడిన పూర్వ విద్యార్థులంతా పాఠశాల 75 వసంతాల వేడుకలు ఫిబ్రవరి 13 న ఘనంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. చదివిన బడికి నాణ్యమైన విద్య,మౌలిక వసతుల కొరకు కొంత ఆర్థిక సహాయం అందించారు.ఆ డబ్బుతోనే ఈరోజు  విద్యార్థిని విద్యార్థులకు (రెడ్,గ్రీన్,బ్లూ,ఎల్లో )రంగు రంగుల దుస్తులు ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు.

అలాగే బాలుర పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు సంకల్ప సిద్ది చారిటి తరుపున బాలికల పాఠశాల విద్యార్థినిలకు అప్స్ చైర్మన్ వరి జ్యోతి-వెంకటేష్ ఎన్ ఎమ్ఎమ్ఎస్ పుస్తకాలను ఉచితంగా అందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు