ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
24-09-2026 | 04:38pm
బోథ్. సెప్టెంబర్ 24 ( విజయ క్రాంతి) సోనాల మండలంలో ని గ్రామానికి చెందిన యాదవ్ నూర్ సింగ్ అనే రైతు కుటుంబాన్ని ప్రభుత్వం(Government) ఆదుకోవాలని రైతు స్వరాజ్యవేదిక(Rythu Swarajya Vedika) జిల్లా అధ్యక్షులు సంగేపు బోర్రన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం గ్రామానికి వెళ్లి రైతు ఆర్థిక స్థితిగతులపై పరిశీలించారు. రైతు నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేశాడని ఆయన పేర్కొన్నారు.
గత ఏడాది పంటకు దిగుబడి రాక ఆందోళన చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 194 ప్రకారం 6 లక్షల రూపాయలు పరిహారంతో పాటు కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. ఆయన వెంట షారుక్ ఉన్నారు . ప్రభుత్వం ఆదుకునేందుకుతన వంతు కృషి చేస్తానని మృతి చెందిన రైతు కుటుంబానికి భరోసా కల్పించారు.