ఎన్ఎస్ఎస్ సేవా భావంతో విద్యార్థులు ముందుకు సాగాలి...
ప్రభుత్వ జూనియర్ కళాశాల యాదగిరిగుట్టలో ఘనంగా ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం...
యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): ప్రభుత్వ జూనియర్ కళాశాల యాదగిరిగుట్టలో ఎన్ఎస్ఎస్ యూనిట్ (NSS Unit)ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ అస్సాహెల్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ రాంబాబు (NSS Program Officer Rambabu) మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ ఆవిర్భావం, దాని లక్ష్యాలు, ఆశయాలు సమాజ సేవలో విద్యార్థులకు వివరించారు. అనంతరం ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులచే ఎన్ఎస్ఎస్ ప్రతిజ్ఞ చేయించారు.
ఎన్ఎస్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా విద్యార్థులు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ అస్సాహెల్ సార్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థుల్లో సేవా భావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ సేవతో పాటు దేశ సేవలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, నాన్-టీచింగ్ సిబ్బంది మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్ విద్యార్థులు పాల్గొన్నారు.