తలమడుగు మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి
జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన కాంగ్రెస్ నాయకులు
తలమడుగు,(విజయక్రాంతి): తలమడుగు మండలాన్ని(Talamadugu Mandal) కరువు ప్రాంతంగా ప్రకటించాలని బోథ్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆడే గజేందర్తో కలిసి కాంగ్రెస్ నాయకులు జిల్లా కలెక్టర్ రాజర్షి షా(Collector Rajarshi Shah)కు వినతిపత్రం అందజేశారు. జిల్లాలో 20 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించి, తలమడుగు మండలాన్ని విస్మరించడం అన్యాయమని వారు పేర్కొన్నారు. పంట దిగుబడులు లేక రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపి, రైతులకు న్యాయం జరిగేలా ప్రయత్నిస్తానని తెలిపినట్లు నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రతాప్, మాజీ జెడ్పీటీసీ బాబన్న, మాజీ ఎంపీపీ లక్ష్మి రాజేశ్వర్,ప్రకాష్ రావు, జి. వెంకన్న, సి రమేష్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సాంబశివ్ సర్పంచులు నగేష్, కే వెంకటేష్, మార్కెట్ డైరెక్టర్ పోశెట్టి,యూత్ కాంగ్రెస్ నాయకుడు సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.