22వ వార్డులో అభివృద్ధి పనుల పరిశీలన

01-10-2026 | 10:47pm

ఆలేరు,(విజయక్రాంతి): భువనగిరి మున్సిపాలిటీ(Bhongir Municipality) 22వ వార్డు పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను(Development Works) స్థానిక కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్(Local Councilor Jaligam Vignesh) మున్సిపల్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఇందిరానగర్‌లోని కమ్యూనిటీ హాల్ వద్ద నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్‌తో పాటు ఇతర అభివృద్ధి పనులను మున్సిపల్ డీఈ సాయి లక్ష్మి, ఏఈ రంజిత్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ జాలిగం విఘ్నేష్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీపడకూడదని అధికారులకు సూచించారు. పనులను నిర్ణీత ప్రమాణాల మేరకు నాణ్యతతో చేపట్టి, వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.

మరిన్ని వార్తలు