వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులకు ఘన సన్మానం
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వాసవి క్లబ్ అవతరణ దినోత్సవాన్ని(Vasavi Club Foundation Day) పురస్కరించుకుని వాసవి క్లబ్, వాసవి వనిత ఆధ్వర్యంలో గురువారం రాత్రి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం(Vasavi Kanyaka Parameswari Temple)లో పూర్వ అధ్యక్షుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు మర్యాల ఉదయ్ బాబు మాట్లాడుతూ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు.
వాసవి క్లబ్ పూర్వ అధ్యక్షులు గంధం శ్రీనివాస్, ఆర్. మురళీధర్, కాసం వినేష్, గుండా వెంకటేశ్వర్, కొలిపాక వేణుగోపాల్, సైనీ సంతోష్, తంగడపల్లి రమేష్, తాటికొండ లక్ష్మయ్య, కొలిపాక రవీందర్, కొలిపాక శంకర్, పాత శ్రీనివాస్‌లను ఘనంగా సన్మానించారు. అలాగే వాసవి వనిత క్లబ్ పూర్వ అధ్యక్షులు సిద్దంశెట్టి సుహాసిని, రావుల అరవింద, రావుల సవిత, సైనీ శ్రీదేవి, మారియాల రజనిలను సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్షులు ముక్త సురేష్, వాసవి ఆలయ కమిటీ అధ్యక్షులు రావుల శంకర్, వాసవి సిల్వర్ స్టార్ గుండా బాలేష్, రాచర్ల లక్ష్మయ్య, కార్యదర్శి బాల శ్రీనివాస్, కోశాధికారి కనుకుంట్ల శ్రీధర్‌తో పాటు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.