యువతి అదృశ్యం
అశ్వారావుపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట(Ashwaraopeta ) మండలం జమ్మిగూడెం గ్రామానికి చెందిన రాజిని రేవతి అనే యువతి గత నెల 28 వ తేదీ నుండి అదృశ్యం అయినట్టు ఎస్ఐ యయాతి రాజు తెలిపారు. గత నెల 28 వ తేదీ రాత్రి 7.00 గంటల సమయంలో గ్రామంలోని వారపు సంతకు కూరగాయలు(Vegetables) కొనుగోలు చేసేందుకు వెళ్లి తిరిగి ఇంటికి రాకుండా అదృశ్యమైనట్లు ఆమె తండ్రి రాజిని వీరాఘవులు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రేవతి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వారపు సంతతో పాటు బంధువుల ఇళ్లలో తెలిసిన ప్రదేశాల్లో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈ మేరకు గురువారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, యువతి ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గల్లంతైన రేవతి ఛామన ఛాయ (గోధుమ వర్ణం), సుమారు 5 అడుగుల ఎత్తు కలిగి ఉంది. అదృశ్యమైన సమయంలో ఆమె ఆకుపచ్చ రంగు పంజాబీ డ్రెస్, పసుపు రంగు చున్నీ ధరించి ఉన్నది. ఆమె వద్ద సెల్‌ఫోన్ నంబర్ 6303856119 ఉన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజిని రేవతి ఆచూకీ తెలిసిన వారు లేదా ఆమెను ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు కోరుతున్నారు.