ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ ను తొలగించాలనీ వామపక్షాల ధర్నా

01-10-2026 | 10:33pm

బెల్లంపల్లి: లోపభూయిష్టమైన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ను నిలిపివేసి, ఈ పక్రియలో ఓటు హక్కు కోల్పోయిన అర్హులందరికీ ఓటు హక్కును పునరుద్ధరించాలని కోరుతూ సిపిఐ, సిపిఐ ఎం, ఎంసిపిఐయు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ, లెఫ్ట్ వామపక్షాల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ముందు ధర్నా  చేశారు. ఈ సందర్భంగా నాయకులు దాగం మల్లేష్,ఆడపు రాజమౌళి, పసులేటి వెంకటేష్, దాగం శ్రీకాంత్,రెడ్డి చరణ్ మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఎన్నికల్లో ఓటు వేసే హక్కును కల్పించిందన్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైన రాజ్యాంగ హక్కు,అయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR) పేరుతో చేపడుతున్న ప్రక్రియలో అర్హత కలిగిన అనేకమంది ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడుతున్నాయని ఆందోళన ప్రజల్లో వ్యక్తం అవుతున్నదన్నారు. భారత ఎన్నికల సంఘం స్వయంగా SIR యొక్క ప్రధాన లక్ష్యం అర్హులైన పౌరులు ఎవరు ఓటర్ల జాబితా నుంచి తొలగింపకూడదు అని పేర్కొందనీ తెలిపారు.

అయినప్పటికీ పత్రాల సమర్పణ ధ్రువీకరణ చిరునామా మార్పులు వలసలు శాంకేతిక సమస్యలు తదితర కారణాలతో అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ఫస్ట్ ఏర్పడితే అది ప్రజా సామ్య హక్కులపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మేము భావిస్తున్నామనితెలిపారు. వెంటనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని లేకుంటే ఆయనను తొలగించాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ,సిపిఎం జిల్లా సమితి సభ్యులు దాగం శ్రీకాంత్,ఎం సిపిఐ యూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసుపులేటి వెంకటేష్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు సోనీ  సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు రెడ్డి చరణ్, భూమయ్య,సిపిఐ బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, బి కే యం యు జాతీయ సమితి సభ్యులు అక్కెపల్లి బాబు, బెల్లంపల్లి మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, తాండూరు మండల కార్యదర్శి కొండు బానేష్,బి కే యం యు జిల్లా కార్యదర్శి గుండాచంద్ర మాణిక్యం,సిపిఐ జిల్లా సమితి సభ్యులు డిఆర్ శ్రీధర్,మేకల రాజేశం, రత్నం రాజ్యం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు