దేశ్ బచావో ఓట్ బచావో కు జిల్లా నుండి 300 మంది
- సహకార సంఘాల చైర్మన్ పదవులు అధిష్టానం నిర్ణయం....
- అన్ని వర్గాలకు సముచిత స్థానం... కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నరేష్ జాదవ్....
బోథ్. అక్టోబర్ 28. (విజయ క్రాంతి): నవంబర్ 1న ఢిల్లీలో జరగనున్న దేశ బచావో ఓట్ బచావో కార్యక్రమానికి(Save the country, save the vote campaign) ఆదిలాబాద్ జిల్లా నుండి 300 మంది వెళ్లడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జాదవ్ నరేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం విజయకాంత్ తో మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లా నుండి తరలి వెళ్లే నాయకులకు ఇప్పటికే తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. పార్టీలో పని పనిచేయడంతో పాటు వివిధ పదవుల్లో ఉన్న నాయకులందరూ ఈ కార్యక్రమానికి రావాలని హై కమండ్ నుండి ఆదేశాలు ఉన్నాయన్నారు. కొంతమంది బస్సులు, రైళ్లలో, విమానాలలో వెళ్లడం జరుగుతుందన్నారు.
సహకార సంఘాల చైర్మన్ పదవుల్లో అన్ని వర్గాలకు సమచితస్థానం....
త్వరలో భర్తీ చేయనున్న సహకార సంఘాల చైర్మన్ పదవుల నియామకంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం లభిస్తుందని ఈ సందర్భంగా జాదవ్ నరేష్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడు లేనివిధంగా ఈసారి మహిళలకు ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి సైతం చైర్మన్ పదవులు లభిస్తాయి అన్నారు. పదవులను కేటాయించడంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు.
పార్టీ కోసం పని చేసిన వారికి సీనియారిటీని బట్టి 80% పదవులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరో 20 శాతం పార్టీలో నూతనంగా చేరిన వారికి పదవులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏది ఏమైనా అధిష్టానం నిర్ణయం తుది నిర్ణయం అన్నారు