రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి

28-10-2026 | 10:42pm

మత్తడి వాగు ప్రాజెక్ట్ నుండి నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్..

తాంసి, అక్టోబర్ 28, (విజయక్రాంతి) : రైతుల ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం రైతులకు ఊరటనిచ్చే విషయమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్(MLA Anil Jadhav) అన్నారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

బుధవారం మత్తడి వాగు ప్రాజెక్ట్ వద్ద మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ అద్ది భోజ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే పూజలు చేసి, కెనాల్‌ ద్వారా నీటి విడుదల చేశారు. రైతులు ఎవరూ అధైర్యపడవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.

ఎలాంటి కష్టాలు ఎదురైనా ఓపికతో, ధైర్యంగా ఉండాలని, రైతులకు అండగా ఉంటూ అందరం కలిసి సమస్యలను ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా, వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తలమడుగు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారికి న్యాయం జరిగేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు