జవహర్ నగర్ ప్రజల.. ఇండ్ల పట్టాల సమస్యకు పరిష్కారం
జవహర్ నగర్ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ విజ్ఞప్తి
జవహర్ నగర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి); జవహర్ నగర్ ప్రజల ఇండ్ల పట్టాల సమస్యకు శాశ్విత పరిష్కారం చూపాలని కీసర ఆర్డీవో నల్ల వెంకట్ రెడ్డికి(Keesara RDO Nalla Venkat Reddy) జవహర్ నగర్ మాజీ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ తదితరులు విజ్ఞప్తి చేశారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలో నెలకొన్న ఇండ్ల పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటూ మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బుధవారం ఆర్డీవోను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ పట్టా సమస్యలు సంబంధిత అంశాలపై వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్డీవో సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్ గుప్తా, నాయకులు పల్లె సత్యం, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.