సుపాకలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన సదస్సు

28-10-2026 | 10:44pm

కోటపల్లి,  (విజయక్రాంతి ): ప్రతి ఒక్కరూ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంపొందించుకోవాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకు(Telangana Grameena Bank ) సిర్సా శాఖ ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ సూచించారు. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని సుపాక గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిర్సా శాఖ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీవైజ్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా పొదుపు, ఆర్థిక ప్రణాళిక, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ పథకాలపై వివరించారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల ప్రయోజనాలను వివరించారు. డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, పిన్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో సుపాక సర్పంచ్ కాశెట్టి సతీష్, సిఎఫ్ఎల్ సంతోష్, బ్యాంకు సిబ్బంది దాగమ సంతోష్, వివోఏ నల్లగుంట సురేష్, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు