5వ బెటాలియన్‌లో రక్తదాన శిబిరం...

28-10-2026 | 10:37pm

పోలీసుల సేవలు చిరస్మరణీయం 

గోవిందరావుపేట,అక్టోబర్ 28 (విజయక్రాంతి): పోలీసు సంస్మరణ వారోత్సవాన్ని(Police Commemoration Week) పురస్కరించుకుని, విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 5వ బెటాలియన్ టీజీఎస్పీ, చల్వాయిలో కమాండెంట్ సి.వి. లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో బుధవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.

ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వి. చంద్రశేఖర్ సూచనల మేరకు, ఆర్‌ఎంఓ, బ్లడ్ బ్యాంక్ బాధ్యులు డా. పి. అనూష ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది పోలీసు సిబ్బంది రక్తదానం చేసి తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా కమాండెంట్ సి.వి. లక్ష్మీకాంతరావుకి వైద్య సిబ్బందికి జ్ఞాపికను అందజేశారు.

కమాండెంట్ మాట్లాడుతూ పోలీసు శాఖ ప్రజల రక్షణ, భద్రత కోసం కృషి చేస్తుంటే, వైద్య శాఖ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అంకితమై పనిచేస్తోంది. ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసే ఈ రెండు శాఖల సమన్వయం అభినందనీయం. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారి ప్రాణాలను కాపాడటం వారికి అందించే నిజమైన నివాళి” అని అన్నారు.

రక్తదాన శిబిరం నిర్వహణలో సేవలందించిన డా. పి. అనూషని కమాండెంట్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమాండ్ ధర్మారావు, ఆర్ఐలు సాయిబాబు, వెంకటేశ్వర్లు, భాస్కర్, ఆర్.ఎస్.ఐ లు బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు