ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందరికీ ఆదర్శం

21-09-2026 | 05:16pm

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): మూడు తరాల ఉద్యమ వారధి అయినా కొండ లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అందరికీ ఆదర్శమని అఖిల భారత పద్మశాలి సత్రం(All India Padmashali Satram) కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట(Yadagirigutta) పట్టణంలోని పద్మశాలి(Padmashali) సత్రంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సెప్టెంబర్ 27, 1915 లో అప్పటి ఆదిలాబాద్ జిల్లా ఇప్పటి కొమరం భీం జిల్లా వాంకిడి గ్రామంలో ఒక నిరుపేద  చేనేత కుటుంబంలో కొండా లక్ష్మణ్ బాపూజీ  జన్మించారు. నిజాం వ్యతిరేక విమోచన ఉద్యమం చేశారు. వెట్టిచాకిరి చేసే 12 కులాల శ్రామికులను ఏకం చేసి రజాకార్లకు, వ్యతిరేకంగా పోరాడారు. తెలంగాణ చేనేత సహకార రంగానికి ఎంతో కృషి చేశారు. 

1952 నాన్-ముల్కీ ఉద్యమం,  2009-2012 మలిదశ ఉద్యమంలో 96 ఏళ్ళ వయసులో కూడా ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరాహార దీక్ష చేశారు. కొండా లక్మన్ బాపూజీ సూచనల వారి మార్గ దర్శనం లో అఖిల భారత పద్మ శాలి అన్న సత్రం గా రూపు దిద్దుకొని దిన దినాభివృద్ధి చెందుతుని రచ్చ శ్రీనివాస్ అన్నారు. 2012 సెప్టెంబర్ 21న 96 ఏళ్ళ వయసులో హైదరాబాద్ లో మరణించారు.  హైదరాబాద్ లోని ఉద్యాన విశ్వవిద్యాలయానికి బాపూజీ పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో సత్రం కోశాధికారి బడుగు మల్లేశం, పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు  ఎర్రగుంట్ల వెంకటేష్ , సత్రం సహాయ కార్యదర్శి గుజ్జ బలరాం, మార్గం యాదగిరి, దీకొండ వెంకటేష్, బొమ్మ సూర్య నారాయణ, కైరంకొండ మధు, గుజ్జ నిర్మల, అంకం నరసింహ, పులగం భిక్షపతి, ఎక్కాలదేవి నరహరి, మెరుగు మధు, మండల శ్రీనివాస్, ఎక్కలదేవి భాస్కర్ మెరుగు అనిల్, వల్లకాటి సురేష్ , అశోక్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు