వార్త వచ్చినా కదలని పనులు!
- ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణం అసంపూర్తి
- రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తాం: హౌసింగ్ ఏఈ శ్రీనివాస్
నాగల్‌గిద్ద, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): నాగల్‌గిద్ద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో చేపట్టిన ఇందిరమ్మ మోడల్ హౌస్(Indiramma model house) నిర్మాణంలో ఇప్పటికీ కదలిక లేదు. పనులు ప్రారంభించి ఏడాది దాటినా నిర్మాణం పూర్తికాని విషయాన్ని ‘ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు మోక్షం ఎప్పుడో?’ శీర్షికన సెప్టెంబర్ 9న ‘విజయక్రాంతి’ వెలుగులోకి తెచ్చింది. వార్త ప్రచురితమై దాదాపు రెండు వారాలు గడుస్తున్నా పనుల్లో పురోగతి కనిపించడం లేదు. లబ్ధిదారులు పరిశీలించి, అదే నమూనాలో ఇళ్లు నిర్మించుకునేందుకు ఉపయోగపడాల్సిన మోడల్ హౌస్ అసంపూర్తిగానే మిగిలిపోయింది.
రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తాం
ఈ విషయమై హౌసింగ్ ఏఈ శ్రీనివాస్‌ను ఫోన్‌లో వివరణ కోరగా, మోడల్ హౌస్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని తెలిపారు. రెండు మూడు రోజుల్లో పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు.