భూ సేకరణ, పునరావాస ప్రక్రియ వేగవంతం చేయాలి

21-09-2026 | 06:33pm

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు(Irrigation projects), కాలువల నిర్మాణంలో భూములు, ఇండ్లు కోల్పోతున్న వారికి మెరుగైన పరిహారం అందించి పునరావాసం కల్పించాలని జిల్లా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని సచివాలయం నుండి రాష్ట్ర రవాణా, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, నీటిపారుదల శాఖ కార్యదర్శులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, కాలువల నిర్మాణంలో ముంపుకు గురయ్యే భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు. భూములు, ఇండ్లు కోల్పోయే వారికి త్వరగా పరిహారం అందించి పునరావాసం కల్పించాలని, రైతులకు మెరుగైన మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందించాలని తెలిపారు. భూ సేకరణ పునరావాసం ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, భూసేకరణ ప్రక్రియలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు.జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులు తిరుపతి, భద్రయ్య, కె.వి. రమణ, వేణుగోపాల్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు