నల్గొండ సహకార బ్యాంకు భవనం ప్రారంభం

05-10-2026 | 09:46pm

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట పట్టణంలో నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ నూతన భవనాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య సోమవారం  ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార రంగం బలోపేతంతో రైతులు, వ్యవసాయదారులు, గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు.

నూతన భవనం ద్వారా ఖాతాదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించడంతో పాటు, రైతులకు అవసరమైన రుణాలు, బ్యాంకింగ్ సేవలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు. యాదగిరిగుట్ట పట్టణం ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్ మౌలిక వసతులను కూడా మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

సహకార బ్యాంకుల ద్వారా రైతులకు అండగా నిలుస్తూ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, బ్యాంక్ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు