ఎమ్మెల్సీ అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి గెలుపునకు కృషి..
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది..
తుంగతుర్తి, (విజయక్రాంతి): ఏఐసీసీ, పీసీసీ ప్రకటించిన వరంగల్, నల్లగొండ ,ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తం రెడ్డి గెలుపునకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తుంగతుర్తి నియోజకవర్గ నూతన మండల అధ్యక్షుల సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో భాగంగా రాష్ట్రంలోని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహిళల భద్రత, భరోసా, ఉచిత కరెంటు, స్మార్ట్ కార్డులు, సన్న బియ్యం పథకాలు ప్రజల గుండెల్లో నిలిచిపోయాయని అన్నారు. గడిచిన బిఆర్ఎస్ పాలనలో కనీసం కట్టిన ఇల్లు కూడా పంపిణీ చేయలేని స్థితి దాపురించిందని, రాష్ట్రంలో నూతనంగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని తీవ్రంగా కెసిఆర్ కేటీఆర్ పాలనపై దుయ్యబట్టారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటి దఫాలో 3500 రెండవ దఫాలో 2000 అదనంగా 500 ఇళ్లు మంజూరు కానట్లు రాజకీయాలకతీతంగా పేద ప్రజలకు ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, మళ్లీ అత్యధిక మెజార్టీతో గెలుస్తామని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం లో పిఎసిఎస్, మార్కెటింగ్ దేవాలయ ఖాళీగా ఉన్న కమిటీలు పూర్తిగా పూరించనున్నట్టు తెలిపారు. గ్రామంలో నూతనంగా గ్రామ శాఖ అధ్యక్షులను అందరి సమక్షంలో ఎన్నుకోవాలని కోరారు.
1885లో స్థాపించిన కాంగ్రెస్ పార్టీ అంచలంచలుగా ఎదుగుతూ, బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర కీలకమని, ఉద్యమకారులను గుర్తించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు.2001లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు కేటీఆర్ కవితమ్మలు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేటీఆర్, కవితలు పార్టీలో ఉన్న నాయకులను అణగదొక్కి పదవులు పొంది, వేలకోట్ల రూపాయలు సంపాదించి, నేడు ఫైవ్ స్టార్ హోటల్ ను కట్టుకున్న నీచ చరిత్ర, బిఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందని విమర్శించారు.
నియోజకవర్గంలో ప్రస్తుతం ఒక లక్ష 20 వేల ఎకరాల్లో వారిసాగు జరిగిందని, ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా పంట పండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అక్టోబర్ చివరి నాటికి పూర్తిస్థాయిలో పంట రానున్నదని దీనితో ప్రతి గ్రామంలో ఐకెపి పిఎసిఎస్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా, అధికారులు కృషి చేయాలని వారిని రివ్యూ మీటింగ్ లో కోరారు. రైతులను ఇబ్బందుల గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రధానమంత్రి మోడీ, అమిత్ షా లను జంజీలు ఊరుకోరని, నిరుద్యోగుల కొలువుల కోసం,ధర్మ పాలన కోసం న్యాయపోరాటం చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా తిరిగి ఓటు నమోదు చేసుకోవాలని, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం, నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలను విస్మరించి, నూతన అధ్యక్షులు హెల్ప్ డెస్క్ సెంటర్ ను ఏర్పాటు చేసి, నాయకులు కార్యకర్తలతో ఐకమత్యంతో కలిసిమెలిసి, ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి మండల పార్టీ అధ్యక్షులు రేగటి రవి గౌడ్, సుంకర జనార్ధన్, కట్ట మల్లారెడ్డి, పచ్చిపాల వెంకన్న, గుడిపల్లి సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, ఝాన్సీ రెడ్డి కొండరాజు, అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.