కరాటే పోటీల్లో పతకాలు సాధించిన కోదాడ విద్యార్థులు
05-10-2026 | 10:46pm
కోదాడ అక్టోబర్ 5 (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంగళగిరిలో జరిగిన నేషనల్ ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్షిప్(National Invitation Karate Championship) నందు కోదాడ శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన స్టూడెంట్ కరాటే క్లబ్ విద్యార్థులు వివిధ విభాగాలలో పాల్గొని పథకాలు సాధించినారని కోచ్ ఆరె మాధవి లత సోమవారం తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థులు అభి, విహార్, సుదీక్ష, మన్హ, లిఖిత, భవ్య, వర్షిత్, సంజిత, సంహితలను చీఫ్ ఆర్గనైజర్, జనరల్ సెక్రెటరీ షిహాన్ డి ప్రభాకర్ మెడల్స్ సర్టిఫికెట్లు ఇచ్చి సత్కరించారు.