సీఎస్ఐఆర్‌-సీసీఎంబీ శాస్త్రవేత్తల సమావేశం...

08-10-2026 | 05:03pm

ఆలేరు, అక్టోబర్ 8 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లిలోని సీఎస్ఐఆర్‌-సీసీఎంబీ అనెక్స్‌-III(CSIR-CCMB Annexe-III) కేంద్రంలో శాస్త్రవేత్తల సమావేశం, విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో 150 మందికి పైగా రైతులు, 100 మందికి పైగా శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు. సీఎస్ఐఆర్‌-సీసీఎంబీ, ఐసీఏఆర్‌-ఐఐఆర్‌ఆర్‌ సంయుక్తంగా అభివృద్ధి చేసిన అధిక దిగుబడి, వాతావరణ అనుకూల వరి రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం 150 మందికి పైగా రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ ఎ. భాస్కర్‌రావు సుస్థిర, వాతావరణ అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని వివరించారు. సీఎస్ఐఆర్‌-సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ వినయ్‌ కె. నందికూరి జిల్లా యంత్రాంగం సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి, ఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, శాస్త్రవేత్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు